క్లాస్‌ లుక్‌ లో తారక్‌!

Friday, December 5, 2025

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్స్ట్  సినిమాలపై ఫుల్‌ ఫోకస్ పెట్టాడు. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘వార్-2’లో హృతిక్ రోషన్‌తో పాటు ఎన్టీఆర్ కూడా యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో తారక్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు. అయితే, తారక్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘దేవర’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా తారక్ ఓ వీడియో బైట్ రూపంలో అభిమానులను పలకరించాడు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘దేవర’ సినిమా ఇప్పుడు అభిమానుల కోసం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆయన ఈ వీడియోలో చెప్పాడు. ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్ సరికొత్త క్లాస్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్‌  థ్రిల్ అవుతున్నారు.

తమ అభిమాన హీరోని ఇలాంటి క్లాస్ లుక్‌లో చూసి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles