వార్‌ 2 పై తారక్‌ అభిమానులు గుస్సా!

Sunday, March 16, 2025

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్-2’లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఇద్దరు హీరోలను ఒకే స్క్రీన్‌పై చూసేందుకు అటు బాలీవుడ్ ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

అయితే, ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ‘వార్-2’ మేకర్స్‌పై ఓ రేంజ్‌ లో ఫైర్ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయ్యిందని మేకర్స్ అంటున్నారు. అయినా కూడా ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్‌కు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా రాలేదని వారు మండిపడుతున్నారు.

ఇకనైనా ఈ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు సంబంధించి ఓ అప్డేట్ ఇస్తే బాగుంటుందని వారు చెబుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles