ఆయనతో సినిమా వద్దు తారక్‌ అన్న

Monday, February 24, 2025

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎలాంటి పొటెన్షియల్ ఉన్న నటుడో స్పెషల్‌ గా  చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి స్టార్ తో ఏ డైరెక్టర్‌ అయినా వర్క్ చెయ్యాలి అని అనుకుంటారు. ఇక ఒక సరైన నటుడు తగిల్తే సాలిడ్ సినిమాలు అందించే డైరెక్టర్‌.. ఇలాంటి కాంబో పడితే మూవీ లవర్స్ కి అలాగే వారి అభిమానులకి కూడా మంచి ట్రీట్ ఉండబోతుంది.

అలాంటి ఓ కాంబోనే ఎన్టీఆర్ అలాగే డైరెక్టర్‌ వెట్రిమారన్ ల కాంబో అని చెప్పవచ్చు. అయితే ఈ క్రేజీ కాంబోలో ఒక సినిమా కావాలని కోరుకున్న తారక్ అభిమానులు ఇపుడు తమకి ఈ డైరెక్టర్‌ తో సినిమా వద్దని చెప్తున్నారు. దీనికి కారణం వెట్రిమారన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన “బ్యాడ్ గర్ల్” టీజరే.

ఈ టీజర్ ఇపుడు ఊహించని కాంట్రవర్సీలు రేపుతున్న నేపథ్యంలో వెట్రిమారన్ ఇలాంటి సినిమాలు నిర్మిస్తూ తన మర్యాద పోగొట్టుకుంటున్నారు అని తనపై చాలా నెగిటివ్ కామెంట్లు కూడా వినపడతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో చాలా మంది తారక్ అభిమానులు వెట్రిమారన్ తో సినిమా వద్దని చెబుతున్నారు. ఒకవేళ ప్లాన్స్ ఉన్నా కూడా ఆపేయాలని సూచిస్తున్నారు. ఇది మాత్రం వీరి నుంచి ఊహించని ట్విస్ట్ అనే చెప్పుకోవాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles