ఆయ్‌ భలే ఉందంటున్న తండేల్‌ బృందం!

Friday, December 5, 2025

అచ్చ తెలుగు గోదావరి యాస బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన తాజా కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఆయ్’ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలోని నాన్-స్టాప్ కామెడీకి థియేటర్లలో నవ్వులు విరబూస్తున్నాయి. ఈ సినిమా సూపర్‌ హిట్‌ దిశగా పరుగులు పెడుతుండటంతో చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఇప్పటికే ‘ఆయ్’ చిత్రానికి పలువురు సెలబ్రిటీలు కూడా మద్ధతు తెలుపుతున్నారు. తాజాగా అభినందనల జాబితాలో ‘తండేల్’ మూవీ టీమ్ కూడా చేరి పోయింది. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న తండేల్‌ చిత్ర బృందం , తాజాగా ‘ఆయ్’ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా వారు ‘ఆయ్’ చిత్ర యూనిట్‌ను  అభినందించారు.

ఇక ‘ఆయ్’ మూవీలో నార్నె నితిన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అంజి కె మణిపుత్ర డైరెక్ట్ చేయగా, ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles