“తండేల్” ఫస్ట్ సింగిల్.. డీఎస్పీకి  తిరుగులేదంతే!

Friday, December 5, 2025

యంగ్ అండ్ టాలెంటెడ్ అక్కినేని యువ హీరో నాగ చైతన్య,  సాయి పల్లవి కాంబో లో తాజాగా రాబోతున్న సినిమా తండేల్‌ . ఈ సినిమాకి యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.
మరి చైతు కెరీర్ లో భారీ అంచనాలు ఉన్న సినిమాగా ఈ మూవీ నిలిచింది.

ఇక ఈ సినిమా నుంచి మోస్ట్‌ అవైటెడ్ బుజ్జి తల్లి పాటని అయితే మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అయితే కొంచెం ఊరిస్తూనే వదిలిన ఈ సినిమా పాట మాత్రం ఇపుడు శ్రోతలకు ఎంతగానో నచ్చేసింది అని అంటున్నారు. మెయిన్ గా దేవిశ్రీ ప్రసాద్ కి ఎక్కువ మార్కులు పడుతున్నాయి.

రీసెంట్ గా కంగువా లోని పాటలు చార్ట్ బస్టర్స్ కాగా వాటితో పాటుగా బుజ్జి తల్లి కూడా మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ మార్క్ లో అదిరిపోయింది అంటూ చాలా కామెంట్లు వినపడుతున్నాయి. తన బీట్స్ సాహిత్యంలో తన ఫ్లేవర్ టచ్‌ లు కనపడుతున్నాయని నెటిజన్లు  అంటున్నారు. ఇలా మొత్తానికి అయితే అందరికీ నచ్చిన ఈ సాంగ్ ఇపుడు యూట్యూబ్ లో మంచి ట్రెండ్‌ లో  నడుస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles