తమిళ హీరో కార్తీ నటించే సినిమాలను తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ చేస్తుంటారు. ఆయనకు తమిళనాట ఎంత ఫాలోయింగ్ ఉందో, తెలుగులో కూడా అంతే ఉంది. ఇక ఆయన ప్రస్తుతం ‘సర్దార్-2’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు పి.ఎస్ మిత్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో వచ్చిన ‘సర్దార్’ చిత్రానికి ఇది సీక్వెల్ మూవీగా రానుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌లో తాజాగా కార్తీకి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.
మైసూరులో షూటింగ్ జరుపుకుంటున్న ‘సర్దార్ 2’ సెట్స్‌లో కార్తీ కాలికి గాయం అయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు చిత్ర యూనిట్. డాక్టర్లు ఆయనను ఒక వారం రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారట. దీంతో ‘సర్దార్ 2’ షూటింగ్‌ను చిత్ర యూనిట్ తాత్కాలింగా నిలిపివేసింది. ఇక వారు మైసురు నుంచి చెన్నై పయనమయినట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ సినిమాలో రజిషా విజయన్, ఎస్.జె.సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.