మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ‘ఓదెల 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె పాల్గొంటూ సందడి చేస్తుంది. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి మంచి విజయాన్ని అందుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. ఇక ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ తన క్రేజ్‌ను చూపిస్తోంది.
ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులను పలు చిత్రాల ద్వారా ఆకట్టుకున్న తమన్నా, అక్కడ ప్రత్యేక గీతాలతోనూ ఆకట్టుకుంటుంది. ‘స్త్రీ-2’ చిత్రంలో తమన్నా ‘ఆజ్ కి రాత్’ స్పెషల్ సాంగ్ మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా, ఇప్పుడు మరో సినిమాలో ప్రత్యేక గీతంలో నటిచేందుకు ఆమె ఓకే చెప్పిందంట. అజయ్ దేవ్గన్ హీరోగా నటిస్తున్న ‘రైడ్-2’లో ఓ స్పెషల్ సాంగ్‌లో తమన్నా డ్యాన్స్ చేయబోతుంది ఈ పాటలో హనీ సింగ్ కూడా ఉంటారని తెలుస్తోంది.
ఇక ఈ పాటను ప్రమోషనల్ సాంగ్‌గా తెరకెక్కించనున్నారు.