శివానిగా వస్తున్న తమన్నా!

Andhrawatch
1 Min Read

అరణ్మనై తమిళంలో సూపర్‌ హిట్‌ గా నిలిచి తెలుగులో విడుదలైన అన్ని వెర్షన్లు కూడా హిట్‌ టాక్‌ ను అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ హార్రర్‌ కామెడీ సిరీస్‌ కు సంబంధించిన నాల్గవ ఫ్రాంచైజీ కూడా తెలుగులో బాక్ పేరుతో రాబోతుంది. ఈ సినిమాకు సుందర్ సి డైరెక్షన్ వహించారు.అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు.

ఈ చిత్రంలో సుందర్ సి కథానాయకుడిగా నటిస్తుండగా.. తమన్నా భాటియా , రాశి ఖన్నా హీరోయిన్లుగా యాక్ట్‌ చేస్తున్నారు. వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ  కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ రివీల్ చేయడంతో తెలుగు ప్రమోషన్స్ మొదలయ్యాయి.తమన్నాని శివాని గా పరిచయం చేస్తూ.. ఆమె లుక్‌ని చిత్ర బృందం  విడుదల చేసింది.

ఈ పోస్టర్‌ లో  తమన్నా.. సాంప్రదాయ గెటప్‌లో కనిపిస్తుంది. సుందర్ సి శివశంకర్‌ గా పరిచయం కాగా, అతని క్యారెక్టర్ పోస్టర్‌లో అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు. రెండు పోస్టర్లు బాక్‌లో కొన్ని స్పైన్ చిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. హిప్‌హాప్ తమిళా  సంగీతం అందిస్తున్నారు.  చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

Share This Article