ఓజీ నుంచి మంచి మాస్ ఫీస్ట్‌ రెడీ అవుతున్న తమన్‌!

Thursday, December 26, 2024

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నిన్నటి వరకు ఏపీ రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో ఆయన ఫోకస్‌ సినిమాల మీద పెట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పవన్ నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఓజీ. ఈ సినిమాను సాహో ఫేమ్‌ సుజీత్‌ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న విడుదల చేసేందుకు సిద్దమవుతున్నట్లు గతంలోనే చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్  మళ్ళీ జూన్ నుంచి “ఓజి” షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే నటుడు కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం  “భజే వాయు వేగం” సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సుజీత్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వివరించారు.

ఓజి అంటే ఓజాస్ గంభీర అని అర్థమని సుజీత్ తెలిపారు.ఈ సినిమాలో పవన్  యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని సుజీత్ వివరించారు. అలాగే ఓజాస్ అంటే మాస్టర్ అని గంభీర అంటే పవన్ క్యారెక్టర్ పేరు అని సుజీత్ తెలిపారు.ఈ చిత్రం ట్రైలర్ కూడా రెడీ అయిందని సినిమా రిలీజ్ కు ముందు విడుదల  చేస్తామని సుజీత్ తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం తమన్ ఇప్పటికే హంగ్రీ చీతా అంటూ పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్ ఇప్పుడు మరో మాస్ ఫీస్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.ఓజి నుంచి త్వరలోనే ఫస్ట్ సింగల్ విడుదల చేయనునట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles