తండేల్‌ నుంచి సాయి పల్లవి వీడియో ఎలా ఉందో ఓ లుక్‌ వేసేయండి!

Sunday, December 22, 2024

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తండేల్ . చందూ మొండేటి దర్శకత్వం లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌ గా  చేస్తుండగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. గురువారం సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. తండేల్ మూవీ షూటింగ్ లో సాయి పల్లవి డిఫెరెంట్ ఎమోషన్స్ తో కూడుకున్న వీడియో అది. ఈ సినిమాలో నటిగా తన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అనే విషయం ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది.

సాయి పల్లవి ఫ్యాన్స్ కి ఇది కచ్చితంగా ఒక ట్రీట్ అని చెప్పాలి. నాగ చైతన్య.మరియు సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడం తో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20, 2024న థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles