విజయ్‌ దేవరకొండతో సుప్రిత వివాహం!

Sunday, December 22, 2024

టాలీవుడ్ సహానటి సురేఖా వాణి కూతురు సుప్రీత గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన వీడియోలు పెడుతూ ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్‌ ను సంపాదించుకుంది. సుప్రీత యూట్యూబర్‌ గా  తన హాట్ ఫొటోలు నెట్టింట షేర్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది.

సుప్రిత ఇటీవల హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ అమర్ దీప్‌తో ఓ సినిమా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయినప్పటికీ సుప్రిత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులతో చిట్ చాట్ చేస్తుంటుంది కూడా.

తాజాగా, ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట సెన్సేషనల్‌గా మారింది. అభిమానులు  లైవ్ చాట్‌లో  సుప్రితను పలు రకాల ప్రశ్నలు అడిగారు. వాటికి ఆమె కూడా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘‘ నువ్వు టాలీవుడ్‌లో ఏ పెళ్లి కాని ఏ హీరోను చేసుకుంటావు’’ అని అడిగాడు. దీనికి గురించి సుప్రిత మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో రౌడీ హీరో  విజయ్ దేవరకొండ అంటే క్రష్ ఉందని ఆయననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన ఫొటోను పోస్ట్‌ చేసింది. దీంతో సుప్రీత పోస్ట్ నెట్టింట వైరల్‌ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles