తెలుగు సినిమాకి నో చెప్పిన సూపర్‌ స్టార్‌!

Tuesday, January 21, 2025

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కు కేవలం ఇండియాలోనే కాదు…ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులున్నారు. ఇటీవల జైలర్‌ సినిమాతో మరోసారి సత్తా ఏంటో బాక్సాఫీస్‌ కు చూపించాడు రజినీ.  ప్రస్తుతం జై భీమ్ ద‌ర్శ‌కుడు జ్ఞాన‌వేల్ డైరెక్ష‌న్‌లో వెట్టయాన్ తో పాటు, లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కూలి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే జైల‌ర్‌కు సీక్వెల్‌గా జైల‌ర్ 2ను కూడా త్వరలోనే అభిమానుల ముందుకు తీసుకుని రాబోతున్నాడు.

ఈ సినిమాకి  సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు వేగంగా జ‌ర‌గుతున్నాయి. జైల‌ర్ మూవీలో ర‌జినీకాంత్‌తో పాటు శివ రాజ్‌కుమార్‌, మోహ‌న్ లాల్ వంటి స్టార్స్ కూడా యాక్ట్‌ చేశారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఓ టాక్‌ ప్రకారం ర‌జినీకాంత్‌కు మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఓ ఆఫర్ చేసింది.

రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతున్న మూవీలో రామ్ తో పాటు మరొక సీనియర్ హీరో పాత్ర కూడా ఉంది. అందుకోసం మైత్రి మేకర్స్ రజనీని ఆ ఆ పాత్ర కోసం సంప్రదించగా ఆ ఆఫ‌ర్‌ను రజని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు చాలా వేగంగా జ‌ర‌గుతున్నాయి. తొలుత ఈ రోల్ లో నటించాల్సిందిగా టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణను సంప్రదించగా ఆయన దీనికి నో చెప్పినట్టు టాక్‌.

 ఆ తర్వాత రజినీని సంప్రదించగా అక్కడ కూడా నో అనే సమాధానమే వచ్చింది. దీంతో మేక‌ర్స్ ఆ పాత్ర‌కు క‌న్న‌డ స్టార్ యాక్ట‌ర్ శివ రాజ్‌కుమార్‌ను తీసుకోనున్నట్టు సమాచారం.  ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్ర దర్శకుడు మహేష్.పి డైరెక్షన్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles