నా భార్య ప్రయత్నం ఫలించాలని కోరుతున్నా..!

Friday, December 5, 2025

సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ .. ఆయన స్టైలిష్ లుక్‌ తో ఇప్పటికి కూడా యంగ్ అండ్ సీనియర్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బంగారం స్మగ్లింగ్ అంశం తో ముడిపడి ఉన్న యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక నటనలోనే కాదు.. ఆయన వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ముఖ్యంగా రజనీ ఎప్పుడూ మన సంస్కృతి, సంప్రదాయలకు చాలా విలువ ఇస్తారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా తన భార్య లత నిర్వహించిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

‘ నేటి యువత పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా ఫాలో అవుతుంది. ఈ మొబైల్ కారణంగా యువతకు, కొందరు పెద్దలకు మన దేశ సంప్రదాయాల గురించి అసలు తెలియడం లేదు. వారంతా భారతదేశ గొప్పతనం, వైభవం గురించి తెలుసుకోకుండా పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తున్నారు. విదేశీయులు వారి సంప్రదాయాల్లో ఆనందం, శాంతిని కనుగొన లేక పోవడం వల్ల మన దేశం వైపు ఆసక్తి చూపిస్తున్నారు.

ధ్యానం, యోగా ద్వారా ఆనందాన్ని, శాంతి కనుగొన్నారు. దీనిపై అందరికీ అవగాహన కల్పించేందుకు నా భార్య లత ఒక గొప్ప ప్రయత్నం మొదలు పెట్టింది. దేవుడి దయతో ఆ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles