మరో హిట్‌ కోసం రెడీ అవుతున్న సూపర్‌ కాంబో!

Monday, January 20, 2025

నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ చిత్రాల విజయ దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగో సినిమాకి ఎప్పుడో సన్నాహాలు మొదలైపోయాయని తెలుస్తుంది. బాలయ్య – బోయపాటి హిట్ కాంబో అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. బాలయ్యకు పెద్ద కమర్షియల్ చిత్రాలే కాకుండా తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాలుగా కూడా నిలవడమే కాకుండా అవార్డులు కూడా తెచ్చిపెట్టాయి.

ఆ క్రెడిట్ కచ్చితంగా బోయపాటికే దక్కుతుంది. తాజాగా రామ్ ఆచంట, గోపీ ఆచంట, 14 రీల్స్ ప్లస్, ఎమ్ తేజస్విని నందమూరి సమర్పణలో #BB4 అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ జరగనున్నట్లు తెలుస్తుంది బాలకృష్ణ, బోయపాటి శ్రీను నాలుగో సారి కలిసి నటిస్తున్న #BB4 చిత్రం దసరా సందర్బంగా అధికారికంగా ప్రకటించారు. లెజెండ్ నిర్మాతలుగా ఉన్న రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై #BB4ని భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.

బాలయ్య చిన్న కూతురు ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో నాలుగో సినిమాగా BB4 వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ విడుదల చేసి సినిమాని ప్రకటించారు. అక్టోబర్ 16న ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి మూహూర్తంగా నిర్ణయించారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. రిలీజ్ చేసిన పోస్టర్లో BB4 అని వర్కింగ్ టైటిల్ పెట్టి వెనుక అమ్మవారి ఫోటో పెట్టడంతో ఇది అఖండ 2 సినిమానేనా లేక వేరే సినిమానా అనే తికమక అయితే మొదలైంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles