పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలపై మళ్లీ ఫుల్ ఫోకస్ పెడుతున్నాడు. ఆయన నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు మరో భారీ సినిమా ఓజీని త్వరగా పూర్తిచేయాలనే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటున్నప్పటికీ, ఆయన రాజకీయ బాధ్యతలు మధ్య మధ్యలో వస్తుండటంతో షెడ్యూల్ కాస్త కష్టంగా మారింది. దీంతో టైమ్ వేస్ట్ కాకుండా కొన్ని కీలక సన్నివేశాలను బాడీ డబుల్‌తో కూడా తెరకెక్కిస్తున్నారు. పవన్ సెట్లో ఉన్నప్పటికీ, ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో అనే అప్రమత్తతతో బాడీ డబుల్‌ను రెడీగా ఉంచుకుంటున్నారు. అర్జెంటుగా ఆయన షూటింగ్ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తే, ఆ సమయంలో షూట్ ఆగకుండా ముందుకు సాగించాలనే ఉద్దేశంతో చిత్ర బృందం ఈ ప్లాన్ చేశారట.
ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా కనిపించనుండగా, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొనడం, పవన్ షెడ్యూల్ మేనేజ్‌మెంట్ విధానం ఇవన్నీ కూడా సినిమా చుట్టూ ప్రత్యేక ఆసక్తి కలిగిస్తున్నాయి.
