వరుణ్‌ తేజ్‌ ని వదిలిపెట్టని సుధీర్‌ బాబు!

Tuesday, October 8, 2024

నవదళపతి సుధీర్ బాబు నటించిన తాజా సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో తెరకెక్కడంతో ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాను దర్శకుడు అభిలాష్ కంకర డైరెక్ట్ చేయగా, ఇందులో సుధీర్ బాబు ఓ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు.

ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ వెరైటీగా నిర్వహిస్తున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు తమ షూటింగ్ స్థానాల్లో ఫోటోగ్రాఫర్లుకు పోజులిచ్చే సమయంలో వెనకాల ‘మా నాన్న సూపర్ హీరో’ బ్యానర్‌ను నిలబెడుతున్నారు.

దీంతో ప్రేక్షకలు సుధీర్ బాబు అండ్ టీమ్ చాలా వెరైటీగా ప్రమోషన్స్ ప్లాన్ చేశారని అంతా అభినందిస్తున్నారు. కాగా తాజాగా ఈ ప్రమోషన్స్ కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ని కూడా వదల్లేదు ఈ చిత్ర బృందం. ఇలా ఓ సినిమా కోసం ప్రమోషన్స్ చేస్తున్నవారికి చిత్ర యూనిట్ థ్యాంక్స్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో షాయాజి షిండే, సాయి చంద్, ఆర్నా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 11న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles