అలాంటి వారిని చెప్పుతో కొట్టాలి..విశాల్‌ సంచలన వ్యాఖ్యలు!

Monday, December 23, 2024

తమిళ నటుడు విశాల్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కాడు. ఇండస్ట్రీలో ఆడవాళ్లను ఏడిపించే పిచ్చి వెధవలను చెప్పుతీసుకుని కొట్టాలని అన్నాడు. కేవలం ఇతర ఇండస్ట్రీల్లో మాత్రమే కాకుండా తమిళంలో కూడా అలాంటి వారు చాలా మందినే ఉన్నారని చెప్పుకొచ్చాడు.

అలాంటి వారిపై దైర్యం గా వచ్చి ఫిర్యాదు చేయాలని ఆయన అన్నారు. కేరళలో ఏర్పాటుచేసిన హేమ కమిటీ లాగే తమిళనాడు నడిగర్ సంఘం ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. కేరళలో అలా ఆడవాళ్లను వేధించిన పాపానికి వారికి కఠిన శిక్ష పడాల్సిందే. మహిళలకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి మగవారిపై ఉంటుందని విశాల్‌ అన్నాడు. శ్రీ రెడ్డి ఎవరో నాకు తెలియదు కానీ‌.. ఆమె పై వేసే జోకులు మాత్రం నేను విన్నానని ఆయన చెప్పుకొచ్చారు.

ఎవరి మీద అయినా నిందలు వేయడం కొందరికి అలవాటుగా మారిందని., నిజంగానే ఇబ్బందులు కలిగితే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఇకపోతే ఆయన రత్నం సినిమాతో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles