దళపతి చివరి సినిమా పై స్ట్రాంగ్‌ బజ్‌!

Andhrawatch
1 Min Read

సౌత్‌ స్టార్‌ నటుడు దళపతి విజయ్‌ ఒకరు. ఇప్పుడు తాను దర్శకుడు వెంకట్‌ ప్రభుతో తన 68 వ చిత్రాన్ని గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైం చేస్తుండగా…  ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్‌ చివరి సినిమా ఎవరితో చేస్తారు అనే దాని గురించి కోలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది.

అయితే తెలుగు నుంచి తమిళ్‌ వరకు చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్ గా ఓ పేరు వినిపిస్తుంది. అది ఎవరి పేరో కాదు..దర్శకుడు హెచ్‌ వినోద్‌. ఆయన “ఖాకీ”, “వలిమై”, “తెగింపు” లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చిన తాను విజయ్ చివరి సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు అని కోలీవుడ్ వర్గాల్లో ఇపుడు గట్టిగా వినిపిస్తుంది.

రీసెంట్ గానే బజ్ కూడా వచ్చింది కానీ ఇపుడు ఈ ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పుడు చేస్తున్న సినిమా పూర్తి కాగానే ఈ క్రేజీ కాంబో సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లుంది.  మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

Share This Article