మరోసారి కారు ప్రమాదానికి గురైన స్టార్ హీరో..!

Friday, December 5, 2025

తాజాగా విడుదలకి వచ్చిన తాజా చిత్రాల్లో  కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” కూడా ఓ సినిమా. అయితే ఈ మూవీలో అజిత్ ఎలాంటి డూప్ లేకుండా సినిమా స్టంట్స్ అన్నీ తానే చేశారు. మరి ఇదే తనకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తీసుకుని వచ్చింది. అజిత్ తన సినిమాల్లో రిస్క్ తో కూడుకున్న స్టంట్స్, రేసింగ్ సీక్వెన్స్ లు గాని ఇతర యాక్షన్ ఎపిసోడ్స్ ని స్వయంగా చేస్తారు.

కొన్నిసార్లు దెబ్బలు తిన్నా కూడా మళ్ళీ పర్ఫెక్ట్ గా చేసే వరకు వదిలిపెట్టరు. మరి అజిత్ ప్రొఫిషినల్ రేసర్ కూడా అని అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులు నుంచి తాను ఓ రేసింగ్ లో పాల్గొనగా మొన్నామధ్య పెద్ద ప్రమాదానికే తాను లోనైన సంగతి తెలిసిందే. అయితే దాని నుంచి చాలా సేఫ్ గా బయటకొచ్చిన థలా ఇపుడు షాకింగ్ గా మళ్ళీ రేస్ ట్రాక్ పైనే ప్రమాదానికి గురయ్యారు. ఈసారి కూడా కార్ ప్రాక్టీస్ లో వర్షపు నీరు ఉన్న ట్రాక్ మీద అదుపు ఢీ కొట్టింది.

అయినప్పటికీ అజిత్ సేఫ్ గా తిరిగొచ్చారు అని తెలుస్తుంది. కానీ మరో వెర్షన్ కూడా దీనికి వినిపిస్తుంది. అది అజిత్ కాదు అని అజిత్ తో ఉండే మరో డ్రైవర్ అంటూ మరో వెర్షన్ కూడా తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో టీం నుంచే ఓ క్లారిటీ రావాల్సి ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles