విశ్వంభర సెట్లో స్టార్‌ డైరెక్టర్‌!

Thursday, January 2, 2025

బింబిసార సినిమా ఫేమ్‌ వశిష్ట డైరెక్షన్ లో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమా సోషియో ఫాంటసీ డ్రామాగా భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ప్రొమో కంటేంట్‌ సినిమా పై అంచనాలను భారీ స్థాయిలో పెంచేసింది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతుండగా.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ మూవీ సెట్స్ కి వెళ్లాడు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు వశిష్ఠకి ప్రత్యేక అభినందనలు తెలియజేయడంతో పాటు చిరంజీవితో తనుకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా ఈ ముగ్గురూ కలిసి దిగిన ఫోటోను డైరెక్టర్ వశిష్ట తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

వినాయక్ ఉన్నట్టుండి ఇలా మెగాస్టార్ ను కలవడంతో  సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోసారి ఈ ఇద్దరూ సినిమా చేయబోతున్నారా? అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. చిరు-వినాయక్ అనుబంధం ఇప్పటిది కాదు. వీరి కాంబోలో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 వంటి హిట్ సినిమాలు వచ్చాయి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles