క్రేజీ కాంబో ప్లానింగ్‌ లో స్టార్‌ డైరెక్టర్‌!

Friday, December 5, 2025

ఇక మరోవైపు బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో, రెండో భాగంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర కోసం బోయపాటి ఓ సీనియర్ హీరోయిన్‌ను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించే అవకాశం ఉందని టాక్. నిజమే అయితే బాలయ్య – విజయశాంతి జోడీ మరోసారి తెరపై కనిపిస్తే అభిమానులకెంతో ఉత్సాహంగా ఉంటుంది. ప్రస్తుతం బాలయ్య అఘోర పాత్రలో కీలక సన్నివేశాలపై షూటింగ్ జరుగుతుందట. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles