రాజమౌళి-మహేష్‌ సినిమా పై స్టార్‌ నటుడు కామెంట్స్‌!

Monday, December 8, 2025

టాలీవుడ్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌ల్లో SSMB29 ఒకటి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమా చుట్టూ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పూర్తి స్థాయి అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది.

ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, SSMB29 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఇప్పటివరకు మనం ఏ సినిమాలో చూడని విధంగా రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నారని, ఇది ఒక్క అడ్వెంచర్ స్టోరీ మాత్రమే కాకుండా, కొత్తగా చెప్పిన ప్రయాణం లాంటిదని చెప్పుకొచ్చారు.

రాజమౌళికి సవాళ్లే ఇష్టం, అలాంటి వాళ్లే సినిమా రంగాన్ని ముందుకు నడిపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమా ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకన్నా ఎక్కువగా ఆకట్టుకుంటుందని ఆయన స్పష్టంగా చెప్పారు.

ఈ కామెంట్లు వింటేనే సినిమా పట్ల ఆసక్తి మరింత పెరుగుతోంది. ఇప్పటికే జక్కన్న స్థాయిని తెలుసుకున్న అభిమానులకు, మహేష్ బాబు కొత్త లుక్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది నిజంగా మంచి ఫీల్ కలిగించే విషయం. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటిస్తుండటం మరో హైలైట్‌గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles