ఇండియన్ సినిమాని ఇపుడు ఓ రేంజ్ లో నిలబెట్టిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి అనే అందరికీ తెలుసు. అయితే జక్కన్న కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలో నేరుగా సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ నుంచి తన ప్రయాణం మొదలైంది అని చాలా తక్కువమందికే తెలిసి ఉండొచ్చు.
అయితే ఈ లేటెస్ట్ గా ఒక ఊహించని క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ప్రెజెంట్ బుల్లితెర గ్లామర్ యాంకర్ రష్మీ, రాజమౌళి కలిసి నటించిన ఓ సీరియల్ ఫన్నీ క్లిప్స్ సడెన్ గా వైరల్ అవ్వడం మొదలయ్యాయి. దీనితో అసలు ఈ ఊహించని కలయిక ఎప్పుడు జరిగింది అని తెలుగు యువత అంతా ఇదే మాట్లాడుకుంటున్నారు.
మరి దీనిపై రష్మీ చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. తమ యువ సీరియల్ నుంచి ఇవన్నీ మంచి మెమొరీలు అని మళ్ళీ తమ సీరియల్ యూనిట్ తో ఒక రీయూనియన్ ఎపిపోడ్ ని ప్లాన్ చెయ్యండి అంటూ అక్కినేని నాగార్జునని ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. మరి కింగ్ నాగ్ ఆ ప్లాన్ చేస్తారో లేదో కానీ రష్మీ, రాజమౌళి క్లిప్ మాత్రం బాగా వైరల్ అవుతుంది.