పాన్‌ ఇండియా సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన శ్రీముఖి!

Wednesday, January 22, 2025

బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి గురించి ఎవరికీ పెద్దగా పరిచయం అక్కర్లేదు. బిగ్‌ బాస్‌ తరువాత ఆమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది.  అందంతో పాటు…తన చలాకీతనంతో యువతను బాగా ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై పలు షోస్‌  యాంకరింగ్ చేస్తూనే.. మరోపక్క సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది.

కేవలం షోస్ మాత్రమే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటే.. అవి తెగ వైరల్ అవుతుంటాయి. బుల్లితెర పై ఏదైనా షోలో శ్రీముఖి కనిపించిందంటే ఆ షో చాలా సందడిగా  ఉంటుంది.

 ప్రతి పండక్కి శ్రీముఖి షో కచ్చితంగా టీవీలో ఉంటుంది. యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈ  అమ్మడుకు ఎక్కువనే చెప్పాలి. గతంలో శ్రీముఖి పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్గా ట్రై చేసింది.. కానీ ఆమెకు పేరు రాలేక పోయింది. దీంతో మళ్లీ బుల్లితెర పైనే తన సత్తా చాటుతుంది. అయితే శ్రీముఖి గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

శ్రీముఖి ఓ పాన్ ఇండియా హీరో సినిమాలో నటించే  అవకాశం కొట్టేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీముఖి ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి సిస్టర్ పాత్రలో శ్రీముఖి కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.  ఈ విషయం పై త్వరలోనే అధికారక ప్రకటన రానుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles