పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా లైనప్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మళ్లీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న హరిహర వీరమల్లు మరియు ఓజీ సినిమాల పనులు దాదాపు పూర్తికావడంతో ఇప్పుడు పవన్ ఫోకస్ మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ మీదే పెట్టారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు వచ్చింది. దీంతో చిత్రబృందం సెట్లోనే ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకి వచ్చి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఫోటోలో శ్రీలీల సాదా లుక్‌లో కనిపిస్తుండగా, పవన్ కళ్యాణ్ మాత్రం పోలీస్ గెటప్‌లో ఉన్నారు. ఇదే ఆయన సినిమాలోని లుక్ కావడం విశేషం. అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది దేవీశ్రీ ప్రసాద్ కాగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ స్పీడుగా కొనసాగుతోంది. పవన్ మాస్ ఫాన్స్‌తో పాటు ప్రేక్షకులందరూ ఈ సినిమాపై మంచి ఆసక్తి చూపిస్తున్నారు.
