చైతూ- సాయి పల్లవికి శ్రీకాకుళం అభిమానులు గ్రాండ్‌ వెల్కమ్‌!

Wednesday, January 22, 2025

అక్కినేని యువ సామ్రాట్‌ నాగ చైతన్య ప్రధాన పాత్రలో, దర్శకుడు చందూ మొండేటి డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. ఈ సినిమా అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి, భారత్ కి రెండు సంవత్సరాల తరువాత తిరిగి వచ్చిన రాజు నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది.

ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ శ్రీకాకుళానికి విచ్చేసింది. యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి లకు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంను GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 20, 2024న విడుదల థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఫుల్ ఆసక్తి నెలకొంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles