ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీదేవి !

Sunday, December 22, 2024

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయమైన సినిమా ఈశ్వర్. ఈ చిత్రంతోనే తమిళ నటుడు విజయ్ కుమార్ కుమార్తె  శ్రీదేవి విజయ్ కుమార్ తెలుగు చిత్ర సీమకు పరిచయం అయింది.  ఈ చిత్ర విజయంతో తెలుగులో పలు అవకాశాలు దక్కించుకుంది శ్రీదేవి. కానీ ఆ సినిమాలు అంతగా రాణించలేదు. దీంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక పెళ్లి తరువాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. కొంతకాలం క్రితం బుల్లి తెరపై పలు టీవీ షోలలో కనిపించింది.

తాజాగా ఈ  తమిళ భామ టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.యంగ్ హీరో నారా రోహిత్  20వ సినిమాగా వస్తున్న సినిమా ‘సుందరకాండ’. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్‌ లో వస్తున్న ఈ  సినిమాలో శ్రీదేవి నటిస్తుంది. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ రిలీజ్ కు హాజరైన శ్రీదేవి మాట్లాడుతూ ”  మళ్ళీ ఇలా అందరినీ మరోసారి కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.  టీజర్ ని చూసినప్పుడు ఈశ్వర్ రోజులు గుర్తుకువచ్చాయి. ఈ సినిమా చాలా మంచి కలర్ ఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్.

చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశాను. అలాగే  ఈశ్వర్ సినిమా గురించి.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈశ్వర్ సినిమా తనకెంతో ప్రత్యేకం. ఆ సినిమా అక్టోబర్ లో రీ రిలీజ్ అవ్వడం తనకెంతో ఆనందంగా  ఉందని పేర్కొన్నారు.  ఇక రెబల్ స్టార్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడని.. ఒకవేళ ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండ ప్రభాస్ తో మరోసారి కలిసి నటిస్తానని” అని తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles