టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్‌లలో శ్రీలీల పేరు మొదటే వినిపిస్తుంది. సినిమాలు హిట్ అవుతున్నాయా, ఫ్లాప్ అవుతున్నాయా అన్న భావనకు వెళ్లకుండా.. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. స్టార్ హీరోల నుంచీ మిడిల్ రేంజ్ హీరోల వరకు అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ తక్కువ టైంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ పైన కూడా శ్రీలీల ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ఒక హిందీ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా రిలీజ్‌కి ముందే మరో భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. ఈసారి ఆమెకు జోడీగా రణ్‌వీర్ సింగ్ కనిపించనున్నాడు.
ఈ ప్రాజెక్ట్‌లో బాబీ డియోల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ద్వారా శ్రీలీల హిందీ మార్కెట్‌లో తన స్థానం ముద్రించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ సౌత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, ఈ బాలీవుడ్ సినిమా విజయవంతమైతే.. పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ పెరగడం ఖాయం.
ఒకే సమయంలో తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తూ, రెండు ఇండస్ట్రీల్లోనూ గట్టిగ అడుగుపెడుతూ, తన కెరీర్‌ను మరింత పెద్ద దశకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది శ్రీలీల.
