Sree Leela: ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని మాత్రం చేయను

Wednesday, January 22, 2025

ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ పని మాత్రం చేయను: శ్రీలీల!

తెలుగు చిత్ర పరిశ్రమకు పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంది శ్రీలీల. ఆ తరువాత రవితేజ తో నటించిన ధమాకా సినిమా కూడా సూపర్‌ హిట్‌ కావడంతో ఇండస్ట్రీ మొత్తం శ్రీలీల వైపు చూసింది. వరుస ఆఫర్లు వెదుక్కుంటూ మరీ శ్రీలీల చెంతకు చేరుకున్నాయి. కానీ గత కొంతకాలంగా ఆమెకు కాలం కలిసి రావడం లేదనే చెప్పవచ్చు.

పోయిన ఏడాది శ్రీలీలవి 4 సినిమాలు విడుదల అయితే అందులో కేవలం ఒకే ఒక్క సినిమా హిట్‌ అయ్యింది. మిగిలిన మూడు డిజాస్టర్‌ గా నిలిచాయి. గుంటూరు కారంలో  మహేష్‌ బాబు పక్కన మెరిసినప్పటికీ ఆ సినిమా కూడా నిరాశే మిగిల్చింది. దీంతో కొద్ది రోజులు బ్రేక్‌ తీసుకుని చదువు మీద దృష్టి పెట్టాలని శ్రీలీల భావిస్తుంది.

దీంతో వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నప్పటికీ వాటికి అన్నింటికి శ్రీలీల నో చెప్పేస్తుందట. శ్రీలీల డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేష్‌ అంతటి వాడే ఆమె డ్యాన్స్ విషయంలో భయపడిపోయాడు అంటే మాటలు కాదు. ఈ క్రమంలో శ్రీలీల కు సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేయాలని ఆఫర్లు కూడా వస్తున్నాయి.

ఇటీవల ఓ స్టార్ హీరో చిత్రంలో శ్రీలీలతో ఐటెం సాంగ్‌ చేయించాలని చిత్ర బృందం ప్రయత్నించిందట..ఈ విషయం గురించి శ్రీలీలను కలిసి భారీ మొత్తంలో డబ్బును కూడా ఆఫర్‌ చేశారంట.. కానీ శ్రీలీల మాత్రం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పిందని సమాచారం. సినిమాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తరుణంలో ఐటెం సాంగ్స్‌ చేయడమంటే ఉన్న పేరును చెడగొట్టుకోవడమే అని శ్రీలీల భావిస్తుందంట.

అందుకే కోట్లు ఇచ్చినా సరే ఐటెం సాంగ్స్ మాత్రం చేయనని శ్రీలీల గట్టిగా కూర్చుంది. శ్రీలీలను గతంలో పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్‌ చేయడానికి సంప్రదిస్తే ఆమె నో చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ఆఫర్‌ బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ ని వరించింది. శ్రీలీల ప్రస్తుతం ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతుంది. ఓ వైపు కెరీర్‌, మరో పక్క సినిమాలను చూసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది.

ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవన్‌ కల్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles