పవన్ కి ఉస్తాద్ భగత్ సింగ్‌ టీం స్పెషల్‌ విషెస్!

Wednesday, January 22, 2025

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ బుధవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు కూడా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్నారు.

. ఈ క్ర‌మంలోనే ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ చిత్ర బృందం కూడా  ఓ స్పెషల్ పోస్టర్ తో పవన్ కళ్యాణ్ కు తమ విషెస్ ని తెలియజేసింది.   కమర్షియల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో గానో వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ రాజకీయాల తో బిజీగా ఉన్న నేపథ్యంలో షూటింగ్ వాయిదా వేశారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ప‌వ‌న్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. కొత్త పోస్ట‌ర్‌ను సోషల్‌ మీడియాలో విడుద‌ల చేశారు. ఆ పోస్ట‌ర్‌లో సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… అంటూ మూవీ టీం రాసుకోచ్చారు. ఇందులో పవన్ ఖాకీ డ్రెస్ లో చేతిలో సుత్తె పట్టుకున్న లుక్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles