ఎంట్రీ సీన్‌ కోసం స్పెషల్‌ సీక్వెన్స్‌!

Saturday, January 10, 2026

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన కొత్త సినిమాతో బిజీగా ఉన్నాడు. లెనిన్ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, అఖిల్ ఎంట్రీ కోసం స్పెషల్ సీన్ ప్లాన్ చేశారు. ఆ కోసం తిరుమల పరిసర ప్రాంతాల్లో పెద్ద సెట్ ను రూపొందిస్తున్నారు. ఈ సీన్‌కి తిరుమల కొండలు ప్రధానంగా నేపథ్యంగా ఉంటాయని చెబుతున్నారు.

కేవలం ఎంట్రీ సీన్ మాత్రమే కాదు, సినిమాలోని స్థానికతను చూపించే సన్నివేశాలను కూడా బాగా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఇలా చూస్తే, అఖిల్ ఎంట్రీ సీన్ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు. అఖిల్ కూడా ఈ సినిమాలో పూర్తిగా తన బాడీ లాంగ్వేజ్, యాస, డైలాగ్ డెలివరీ మీద కష్టపడుతున్నాడట. ఈసారి మరింత కొత్తగా కనిపించేందుకు సీరియస్‌గా ట్రై చేస్తున్నాడు.

ఇక కథకు వస్తే, రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా జరుగుతుంది. ముఖ్యంగా చిత్తూరు ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి, అక్కడి మాడ్యులేషన్‌ని అఖిల్ తన పాత్రలో చూపించనున్నాడు. హీరోయిన్‌గా ఈ సినిమాలో శ్రీలీల నటిస్తుండగా, ఇద్దరి మధ్య రొమాన్స్ కూడ ప్రత్యేకంగా నిలిచేలా డిజైన్ చేశారట.

సినిమా యూనిట్ ఆలోచన ప్రకారం, దసరా పండుగ సమయంలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles