స్పెషల్‌ లొకేషన్‌!

Monday, January 27, 2025

నట సింహం బాలయ్య బాబు – మాస్‌ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ మూవీ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై బోయపాటి కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు లొకేషన్స్ ను ఫైనల్ చేసే పనిలో టీమ్‌ ఉంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ లో ఎంట్రీ ఇచ్చే అఖండ పాత్ర ఎంట్రీ సీన్ కోసం ప్రత్యేకంగా ఓ లొకేషన్ ను డిజైన్ చేసి, భారీగా సెట్ వేస్తారట.

కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఏర్పడ్డాయి.

పైగా బాలయ్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉండటంతో పాటు, అన్నిటికి మించి ఈ సినిమా, హిట్ సినిమాకి సీక్వెల్ కావడంతో ఈ చిత్రం పై మరింతగా హైప్‌ నెలకొంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles