హీరామండి 2 పై స్పెషల్ అనౌన్స్‌మెంట్‌!

Sunday, December 22, 2024

బాలీవుడ్ స్టార్ దర్శకుడు  సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’. 1940ల కాలంలో భారత్ బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి హీరామండి అనే రెడ్ లైట్ ప్రాంతంలో జీవనం సాగించిన డ్యాన్సర్ల జీవితాల గురించి ఈ సిరీస్‌లో దర్శకుడు భన్సాలీ కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌ను సంజయ్‌ తన సొంత నిర్మాణ సంస్థ నుంచే రూ. 200 కోట్ల బడ్జెట్‌తో భారీగా నిర్మించాడు. కాగా ఈ సిరీస్‌లో నటీమణులు మనీష కోయిరాల, రిచా చద్దా, సంజీదా షేక్, షార్మీన్ సెగల్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ వెబ్‌ సిరీస్‌ దేశవ్యాప్తంగా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.  ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ పెద్ద సంచలనమే రేపింది.

తెలుగులో కూడా అందుబాటులో ఉండటంతో ఇక్కడ కూడా మంచి ఆదరణ లభించిందనే చెప్పుకోవాలి. పాజిటీవ్ టాక్ అందుకున్న ఈ సిరీస్‌పై ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాలు నిజం అయ్యాయి. ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ సీజన్‌-1 సూపర్‌ హిట్‌ అవ్వడంతో తాజాగా సీజన్‌ -2 కూడా త్వరలోనే రాబోతుందని  మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. త్వరలో విడుదల చేస్తామని సోషల్‌ మీడియా ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles