బ్లాక్‌ బస్టర్ సీక్వెలత్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సొట్టబుగ్గల సుందరి!

Monday, December 8, 2025

టాలీవుడ్‌ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమా ఝుమ్మంది నాదం తో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…అతి తక్కువ టైమ్‌ లోనే మంచి హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తరువాత తెలుగులో చాలా చిత్రాల్లో నటించింది. ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. నార్త్‌లో అమ్మడికి స్టార్ స్టేటస్ రావడంతో, తెలుగు సినిమాలను పక్కకు పెట్టేసింది. అయితే, ఇప్పుడు తిరిగి తెలుగులో ఓ సినిమాతో తాప్సీ రీ-ఎంట్రీకి సిద్ధమవుతోందని తెలుస్తుంది.

ఆమె నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆనందోబ్రహ్మ’ చిత్రానికి సీక్వెల్ మూవీని త్వరలోనే ప్రారంభించేందుకు మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సీక్వెల్ చిత్రాన్ని దర్శకుడు మహి వి రాఘవ్ డైరెక్ట్ చేయనున్నారట. ఈ సినిమాతో తాప్సీ తిరిగి తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles