క్షమించండి సార్‌ అన్న కీర్తి సురేశ్‌!

Friday, December 5, 2025

హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవల సీనియర్ నటుడు జగపతి బాబుతో క్షమాపణలు చెప్పిన విషయం చర్చనీయాంశంగా మారింది. జగపతి బాబు వ్యాఖ్యాతగా ఉన్న టాక్‌ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో కీర్తి పాల్గొని చాలా విషయాలు ఓపెన్‌గా పంచుకుంది. తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి గురించి మాట్లాడుతూ కీర్తి మనసులోని విషయాలను బయటపెట్టింది.

ఆమె చెప్పినదాని ప్రకారం, పెళ్లి వేడుకకు జగపతి బాబును ఆహ్వానించలేకపోయిందని దీనిపై తనకు బాధగా ఉందని తెలిపింది. సినిమా రంగంలో తన ప్రేమ గురించి చాలా తక్కువమందికే తెలిసిందని, వారిలో జగపతి బాబు కూడా ఒకరని కీర్తి చెప్పింది. తాను ఆయనపై నమ్మకం ఉంచి వ్యక్తిగత విషయాలు పంచుకున్నానని, కానీ పెళ్లికి పిలవలేకపోయానని అందుకే క్షమాపణలు చెప్పిందని తెలిపింది.

తన జీవిత భాగస్వామి ఆంథోనీ తటిల్‌తో ఉన్న ప్రేమ గురించి కూడా ఈ షోలో ఆమె వివరించింది. ఇద్దరూ దాదాపు 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని, ఆరేళ్ల పాటు దూరంగా ఉన్నప్పటికీ బంధం బలంగా కొనసాగిందని చెప్పింది. ఆంథోనీ ఖతార్‌లో ఉంటే, తాను భారత్‌లో ఉన్నానని, నాలుగేళ్ల క్రితం ఇళ్లలో చెప్పి చివరికి పెళ్లితో తమ ప్రేమను ముగించుకున్నామని కీర్తి తెలిపింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles