ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ యాక్షన్ సినిమా ‘వార్ 2’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే నిర్వహించిన ప్రత్యేక వేడుకలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఆ సందర్భంలో మాట్లాడిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
తాజా వేడుక గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్, ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వేదికపై ఆ కృతజ్ఞతలు చెప్పడం మరిచిపోయానని, అందుకే తరువాత అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు హైదరాబాద్ పోలీస్ విభాగం అందించిన సహకారం వల్ల అభిమానులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఈవెంట్‌ను ఆస్వాదించగలిగారని తెలిపారు.
అభిమానులను జాగ్రత్తగా చూసుకున్నందుకు, వారికి మంచి అనుభూతి కలిగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈవెంట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరి మద్దతు వల్లే వేడుక ప్రశాంతంగా సాగిందని ఆయన అన్నారు.
