త్వరలో సెట్స్‌ పైకి ఎఫ్‌ 4..!

Thursday, July 4, 2024

టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ నటుడు విక్టరీ వెంకటేష్‌. , మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఎఫ్‌ 2 సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. పెళ్లి తరువాత వచ్చే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమా భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఈ సినిమాలో తమన్నా ,మెహ్రిన్ హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ ఫన్ ఫ్రాంచైజ్ నుండి వచ్చిన మరో సినిమా F3 ఈ సినిమాను కూడా దర్శకుడు అనిల్ రావిపూడే థియేటర్లలోకి తీసుకుని వచ్చారు.  

అయితే ఈ సినిమాలో డబ్బు కోసం పడే కష్టాలను మరింత ఫన్నీ గా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులకు అంత ఫన్ ని అందించలేకపోయింది. థియేటర్స్ లో ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ప్రాంచైజ్ ను కొనసాగిస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. దీంతో F4 కు రంగం సిద్ధం అయినట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ , వరుణ్ తేజ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించనున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles