కిరణ్‌ అబ్బవరం మూవీకి సాలిడ్ ఆఫర్స్?

Sunday, December 22, 2024

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా చేస్తున్న తాజా చిత్రమే “క”. వరుస పరాజయాలు తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఈ యంగ్ హీరో ఓ సాలిడ్ సబ్జెక్టుతో వస్తుండగా ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన టీజర్ తో మంచి ఫీడ్ బ్యాక్ ని  సొంతం చేసుకున్నాడు.

దర్శకులు సుజీత్ సందీప్ లు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ఆఫర్స్ వస్తునట్టుగా తెలుస్తుంది. మరి టీజర్ ఇంప్రెసివ్ గా ఉండడంతో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రానికి 10 కోట్లకి పైగా బిజినెస్ జరుగుతున్నట్టుగా సమాచారం. మన టాలీవుడ్ కి చెందిన ఒక లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది.

మొత్తానికి అయితే కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేలా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్ గా చేస్తుండగా సామ్ సి ఎస్ సంగీతం సమకూరుస్తున్నాడు. అలాగే శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles