అలా సరదాగా…!

Andhrawatch
1 Min Read

యంగ్ హీరోయిన్‌, అందాల ముద్దుగుమ్మ  మీనాక్షి చౌదరి ఇండస్ట్రీలోని కొందరు హీరోలపై చేసిన సరదా కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. విశ్వక్‌ సేన్‌ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘మెకానిక్‌ రాకీ’ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొన్న మీనాక్షి కొందరి హీరోలపై తన అభిప్రాయన్ని సరదాగా తెలిపింది. . మహేష్ గురించి చెబుతూ.. ‘మహేశ్‌బాబు క్రమశిక్షణగా ఉంటారు. ఇకతమిళ స్టార్ హీరో విజయ్ గురించి మాట్లాడుతూ..ఆయన ఎప్పుడూ ఒకేలా ఉంటారు’ అంది.

ఇక మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ గురించి చెబుతూ.. ‘దుల్కర్‌ సల్మాన్‌ ఎప్పుడు వినయంగా ఉంటారు.ఆ  వినయం అంటే నాకు ఇష్టం. వరుణ్ తేజ్‌ది పూర్తిగా జెంటిల్‌మ్యాన్‌ నేచర్‌. ఇక విశ్వక్‌సేన్‌ ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఎనర్జిటిక్‌గా ఉంటూ సెట్‌లో సందడి చేస్తుంటారు’ అంటూ మీనాక్షి చౌదరి తెలిపింది.

ప్రస్తుతం మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతుంది. రీసెంట్ గానే లక్కీ భాస్కర్ సినిమాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మరి ‘మెకానిక్‌ రాకీ’ కూడా ఎలాంటి హిట్‌ అందుకుంటుదో వేచిచూడాల్సిందే.

- Advertisement -
Share This Article