టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల హీరోయినుగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా స్కంద, ప్రేక్షకులను మెప్పించడమే కాక, యూట్యూబ్‌లో కూడా భారీ హిట్టు సాధించింది. హిందీ వెర్షన్‌లో ఈ సినిమా 380 మిలియన్ వ్యూస్ పైగా, 2.8 మిలియన్ లైక్స్‌కి చేరి మంచి రిపోర్ట్ ఇచ్చింది.
రామ్ సినిమాలు హిందీ ప్రేక్షకుల దగ్గర ఎప్పుడూ ఫేవరెట్‌గా ఉంటాయి, అలాగే స్కంద కూడా తన యూట్యూబ్ ఆడిటోరియం ద్వారా రికార్డు స్థాయిలో వ్యూస్ పొందింది. మొత్తం నాలుగు అధికారిక యూట్యూబ్ ఛానల్స్ కలిపి ఈ విజయాన్ని సాధించడం మేకర్స్‌కి సంతోషకరంగా నిలిచింది. స్కంద కోసం థమన్ సంగీతం అందించాడు, శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు.
