సిట్టింగ్‌ సక్సెస్‌ అయినట్లేనా..ఈ కొత్త లుక్‌ అందుకేనా!

Sunday, December 22, 2024

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, దర్శక ధీరుడు జక్కన్న కాంబోలో ఎస్ఎస్‌ఎంబీ 29 సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ దుబాయ్ లో సిట్టింగ్‌ వేసినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. సినిమాలకు ఏ మాత్రం విరామం దొరికిన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిపోయే మహేష్‌…ఈ సారి దుబాయ్‌ వెళ్లారు.

అక్కడ జక్కన్న తో కలిసి తమ సినిమా కోసం డిస్కషన్‌ చేసినట్లు తెలుస్తుంది. వీరిద్దరూ తాజాగా ఎయిర్‌ పోర్టులో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్ పూర్తి కావడంతో  షూటింగ్ మొదలు కానున్నట్లు అభిమానులు భావిస్తున్నారు.

తాజాగా మహేష్ బాబు హెయిర్ స్టైల్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ న్యూ లుక్‌ అంతా రాజమౌళి సినిమా కోసమే అని తెలుస్తుంది.  గడ్డం, పొడవాటి జుట్టుతో స్టైలిష్ గా  ఉన్నాడు మహేష్‌ బాబు. మొత్తానికి ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లో రాజమౌళి, మహేష్ బాబు కలిసి ఉన్న ఫోటోలు అభిమానులు వైరల్‌ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles