‘సింగిల్’ ట్రైలర్ టాక్.. ఎలా ఉందంటే!

Andhrawatch
1 Min Read

టాలీవుడ్‌లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్‌గా హీరో శ్రీవిష్ణు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆయన చేసే సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటాయి. ఇక శ్రీవిష్ణు నటిస్తున్న తాజా సినిమా ‘సింగిల్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాను డైరెక్టర్‌ కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

‘సింగిల్’ ట్రైలర్ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మేకర్స్ కట్ చేశారు. శ్రీవిష్ణు మార్క్ కామెడీతో ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్‌లో విడుదల చేశారు. శ్రీ విష్ణు తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. శ్రీ విష్ణుతో కలిసి వెన్నెల కిషోర్ చేయబోయే కామెడీ ప్రేక్షకులకు ఫన్ రైడ్ అందించడం ఖాయమని స్పష్టం అవుతోంది.

Share This Article