కింగ్డమ్‌ టికెట్స్‌ ఎప్పటి నుంచి అంటే..!

Monday, December 8, 2025

విజయ్ దేవరకొండ ఇప్పుడు చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘కింగ్డమ్’పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్‌డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, ఇది పూర్తిగా యాక్షన్‌తో నిండిన థ్రిల్లర్‌గా రూపొందుతోంది. దీంతో ఈ సినిమాకి దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా మంచి బజ్ ఏర్పడింది.

విజయ్ దేవరకొండ సినిమాలు అంటేనే అమెరికాలో ప్రత్యేకంగా స్పందన ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ‘కింగ్డమ్’ లాంటి హై ఇంటెన్స్ యాక్షన్ మూవీకి అక్కడి ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ కనిపిస్తోంది. అందుకే మేకర్స్ ఈ సినిమాను ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టికెట్ బుకింగ్స్ జూలై 17 నుంచి ప్రారంభమవుతున్నట్టు అధికారికంగా వెల్లడించారు.

ఇదిలా ఉండగా, సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఇప్పుడు ముందురోజే సినిమాను చూడాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన భాగ్యశ్రీ బొర్సే నటిస్తుండగా, సంగీతం అనిరుధ్ రవిచందర్ ట్యూన్స్ అందిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్నాయి.

మొత్తానికి యాక్షన్ మూవీ లవర్స్‌తో పాటు విజయ్ ఫ్యాన్స్‌కి కూడా ఇది ఓ స్పెషల్ ఫెస్టుగా మారనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles