కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే!

Friday, January 10, 2025

హీరో సిద్ధార్థ్ తాజాగా యాక్ట్‌ చేసిన  లేటెస్ట్ సినిమా ‘మిస్ యు’ ఇప్పటికే  విడుదల కావాల్సి ఉన్నా.. తమిళనాడులో వర్షాల కారణంగా ఈ సినిమాను చిత్ర బృందం వాయిదా వేసింది. ఈ సినిమాను దర్శకుడు ఎన్.రాజశేఖర్ డైరెక్ట్ చేస్తుండగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకుల్లో సినిమాపై మంచి బజ్‌ని అయితే క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సినిమాను డిసెంబర్ 13న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని.. ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే కథ దీనిలో ఉందని వారు కాన్ఫిడెంట్‌గా అంటున్నారు. ఈ సినిమాతో సిద్ధార్థ్ మరోసారి సక్సెస్‌ను అందుకోవడం గ్యారంటీ అని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ సినిమాలో అందాల భామ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles