ఓటీటీలోకి సిదార్థ్‌ లేటేస్ట్‌ మూవీ!

Thursday, December 4, 2025

తమిళ సినిమాలతో పాటు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో కూడా మంచి స్థానం సంపాదించుకున్న నటుడు సిద్ధార్థ్ తాజాగా నటించిన సినిమా “3 బీహెచ్‌కే” ఓటిటిలోకి వచ్చేసింది. భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే ఈ ఫ్యామిలీ డ్రామా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి ఓ మోస్తరు స్పందన పొందింది.

ఈ చిత్రాన్ని సాయి గణేష్ అనే యువ దర్శకుడు తెరకెక్కించగా, ప్రముఖులు శరత్ కుమార్, దేవయాని, చైత్ర జె ఆచార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక అమృత్ రామ్ నాథ్ అందించిన సంగీతం ఈ సినిమాకి కీలక బలం అయింది. నిర్మాణ బాధ్యతలను అరుణ్ విశ్వ తీసుకున్నారు.

ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు భాషలో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ చేసినవాళ్లు ఇప్పుడు ఓటిటిలో చూడొచ్చని చెప్పొచ్చు. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, జీవన విలువలతో సాగిపోయే ఈ సినిమా ఓ సున్నితమైన కథను చెబుతుంది.

వీటన్నింటి మధ్యలో నటుడు సిద్ధార్థ్ ప్రదర్శించిన పరిణతి పాత్రాచరణ ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తక్కువ హంగులతో సింపుల్‌గా తెరకెక్కించిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులకు తప్పకగా నచ్చుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles