హీరో సిద్ధార్థ్ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఇక సిద్ధార్థ్ నటించే సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. అయితే, ఆయన నటిస్తున్న తాజా సినిమాని శ్రీ గణేష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ టీజర్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది చిత్ర బృందం.
ఈ చిత్రానికి ‘3BHK’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జరిగే విషయాలు మనకు ఈ సినిమాలో కథగా చూపించబోతున్నట్లు ఈ టైటిల్ టీజర్ చూస్తే తెలుస్తుంది. సాధారణ గుమాస్తా అయిన ఓ తండ్రి, ఇంట్లో అందరి పనులు చూసుకునే తల్లి.. వారికి ఓ కొడుకు, కూతురు.. వారి కల.. అనే నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు ఈ టైటిల్ టీజర్ లో తెలుస్తుంది.
ఇక ఈ మూవీలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్యూర్ ఫ్యామిలీ సబ్జెక్ట్‌గా రానున్న ఈ సినిమాకు అమ్రిత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.