స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ బ్యూటీ ఇప్పుడు నేషనల్ స్థాయిలో కాకుండా ఏకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమాలు చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తుంది. శ్రుతి హాసన్ నటించిన ఓ ఇంటర్నేషనల్ మూవీకి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ కావడంతో ఈ బ్యూటీ ట్రెండింగ్ అవుతుంది.
బ్రిటిష్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘ది ఐ’లో శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్ సస్పెన్స్ అంశాలతో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కట్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే శ్రుతి హాసన్ ఈ మూవీతో ఇంటర్నేషనల్ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించాల్సి ఉంది. కాగా, ఈ చిత్ర ట్రైలర్ పై అభిమానులు పాజిటివ్ కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇక శ్రుతి హాసన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది.