నీలో ..నాలో అంటూ వచ్చేస్తున్న శ్రీ విష్ణు!

Monday, January 20, 2025

యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా సినిమా ‘శ్వాగ్’ . ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఈ మూవీ నుండి విడుదల అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

కాగా, ఈ సినిమా నుండి మరో మెలోడి లిరికల్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.  ‘నీలో నాలో’ అంటూ సాగే ఈ లిరికల్ పాట శ్రీ విష్ణు, మీరా జాస్మిన్‌లపై చిత్రీకరించారు. భువనచంద్ర అందించిన ఈ చక్కటి లిరిక్స్‌కి వివేక్ సాగర్ అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేసి అందించారు.

ఈ పాటను రాజేష్ కృష్ణన్, అంజనా సౌమ్య  పాడారు. ఈ పాట ఆద్యంతం వినసొంపుగా ఉండటం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు 4 వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో తెలిపిన సంగతి తెలిసిందే.  రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 4న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దం అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles