ఓటీటీలోకి షో టైమ్‌!

Monday, December 8, 2025

టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘షో టైమ్’ ఇటీవల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పట్ల వచ్చిన స్పందన మిశ్రమంగా కనిపించింది. కానీ థ్రిల్లింగ్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది.

మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ చంద్రతో పాటు కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటించింది. థియేటర్లలో విడుదలైన కొంతకాలానికే ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో జూలై 25న ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోందని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ సినిమాకు డిజిటల్ హక్కులు ఉన్నప్పటికీ స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత ఇంకా రావాల్సి ఉంది.

ఇక ఈ చిత్రంలో నరేష్, రాజా రవీంద్ర లాంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శేఖర్ చంద్ర అందించిన నేపథ్య సంగీతం, కిషోర్ గరికిపాటి నిర్మాణ విలువలు ఈ సినిమాకు బలంగా నిలిచాయి. థియేటర్లలో మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా, ఓటీటీలో థ్రిల్లింగ్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకర్షిస్తుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles