స్టార్ హీరోయిన్ పై షాకింగ్ కామెంట్లు!

Thursday, March 13, 2025

టాలీవుడ్ అందాల రాశి… రాశి ఖన్నా గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే అంటూ కుర్ర కారు గుండెల్లో గూడు కట్టుకుంది. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ అందరినీ అలరించింది. కానీ తెలుగులో ఎందుకో రాశికి పెద్దగా పేరు రాలేదు.

నిన్న కాక మొన్న వచ్చిన హీరోయిన్లు కూడా ముందుకు దూసుకుపోతుంటే..రాశి మాత్రం ఇంకా అక్కడే ఉంది. అంతేకాకుండా ఆఫర్లు కూడా భారీగా తగ్గాయి. అయితే రాశి మాత్రం అభిమానులతో ఎప్పుడూ టచ్‌ లోనే ఉంటుంది. తాజాగా ఈ చిన్నది తన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

ఈ ఫొటోల్లో లాంగ్ సూట్‌లో కనిపించి తన ఫ్యాన్స్‌కు సర్పైజ్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ స్పందిస్తూ , రాశి  డ్రెస్‌ గురించి రకరకాల కామెంట్స్  పెడుతున్నారు… ఏంటీ ఈ డ్రెస్ నీదా లేక మీ అక్కాదా అని కొందరు అంటుంటే.. ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు..కొట్టుకొచ్చావా ఏంటీ? అని కొందరు , రాశి ఈ డ్రెస్ నీదేనా.. ఎక్కడైనా అడిగి తెచ్చుకున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నెటిజన్లు  చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles